మంత్రి చొరవతో సోలార్ హైమస్ లైట్ల ఏర్పాటు
MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలోని 9వ వార్డులో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆదేశాలతో బుధవారం సోలార్ హైమస్ లైట్లను ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సునీత సుశీల్ ప్రారంభించారు. 9వ వార్డులో స్ట్రీట్ లైటింగ్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు మంత్రి చొరవ చూపారని కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి వార్డ్ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.