ఆ విషయంలో పళనిస్వామి విఫలమయ్యారు: పన్నీర్ సెల్వం
ప్రజల మన్ననలను పొందటంలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి విఫలమయ్యారని డీఎంకే నేత పన్నీర్ సెల్వం తెలిపారు. అందుకే 2017 నుంచి 2024 మధ్య జరిగిన 10 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారని చెప్పారు. ప్రస్తుతం తను డీఎంకేలో కార్యకర్తగా ఉన్నట్లు తెలిపారు. సీఎం స్టాలిన్ ఆదేశిస్తే బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరోసారి డీఎంకే అధికారంలోకి వస్తుందన్నారు.