'అంగన్వాడీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి'

'అంగన్వాడీ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలి'

ASR: డుంబ్రిగూడలోని పిత్తమరిగుడలో నిర్మాణ దశలోనే అసంపూర్తిగా వదిలేసిన అంగన్వాడీ భవనాన్ని తక్షణమే పూర్తి చేయాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి. సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. 2022లో రూ. 14 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించారని, గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ పనులు సగంలోనే వదిలేసారన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.