అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం: అనిత
AP: అగ్రిగోల్డ్ బాధితులు హోంమంత్రి అనితను కలిశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బాధితులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని తెలిపారు. బాధితులు ఎవరూ ఆందోళన, అఘాయిత్యాలకు పాల్పడవద్దని సూచించారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.