చిట్యాల మండలంలో 13 వార్డు స్థానాలు ఏకగ్రీవం
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా చిట్యాల మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లో 13 వార్డు స్థానాలకు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. నేరడ గ్రామపంచాయతీలో 6,7వ వార్డులు మినహా మిగతా పది వార్డులు, అలాగే ఆరెగూడెం లో 3వ వార్డు, వనిపాకలలో 5వ వార్డు, బొంగోని చెరువులో 8వ వార్డు ఏకగ్రీవం అయినట్లు ఇవాళ నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారులు ప్రకటించారు.