భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
SRCL: వేములవాడ భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. సోమవారాలు మరియు పండుగ దినాల్లో రద్దీ విపరీతంగా పెరుగుతుంది. ఆదివారమే రాజన్న ఆలయానికి చేరుకున్న భక్తులు సోమవారం కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించారు. అనంతరం ధర్మగుండంలో పవిత్ర స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించడంతో పాటు, కుంకుమ పూజలు నిర్వహించారు.