జిల్లా టాపర్‌ను అభినందించిన ఎమ్మెల్యే

AKP: ఎలమంచిలిలోని ఓ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన వై.అనీషా పదో తరగతి పరీక్షల ఫలితాల్లో సత్తా చాటింది. అనీషా 599 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలవడంతో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అభినందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనీషా సరస్వతి పుత్రికగా పేర్కొన్నారు. ఆమెను మిగిలిన విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జనసేన నాయకులు కొఠారి శ్రీనివాస్ పాల్గొన్నారు.