కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు

ATP: బొమ్మనహాల్ మండలం తారకాపురం గ్రామంలో గురువారం కుక్క స్వైరవిహారం చేయడంతో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. తారకాపురం గ్రామానికి చెందిన హెచ్. హనుమంతు కుమార్తె శీరీష, వరుణ్ కుమార్తె పల్లవిలపై కుక్క స్వైర విహారం చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో కుటుంబ సభ్యులు ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.