పులిచెర్లలో సీఎం ఫోటోకు పాలాభిషేకం

CTR: పులిచెర్ల మండలం కొత్తపేట గ్రామంలో శుక్రవారం కొత్తగా వితంతువుల పింఛన్లు మంజూరయ్యాయి. పింఛనుదారులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పెన్షన్లు రావడానికి కృషి చేసిన టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చల్లా బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. పింఛన్ల ద్వారా జీవనాధారం లభించిందని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.