వై.కోటలో తీవ్ర విషాదం.. 8 ఏళ్ల చిన్నారి మృతి

అన్నమయ్య: ఓబులవారిపల్లి మండలంలోని వై.కోటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి చదువుతోన్న 8 ఏళ్ల చందన జ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకుంది. ఈ క్రమంలో ఆమెను కోడూరుకు తరలిస్తుండగా ఫిట్స్ రావడంతో, స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళుతుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.