'ప్రజలకు అందుబాటులో ఉంటూ, అభివృద్ధి చేస్తా'
NLG: తిప్పర్తి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తానని కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థి బద్ధం రజిత సుధీర్ తెలిపారు. బస్టాండ్ సెంటర్ నుంచి బీసీ కాలనీ, సత్తిరెడ్డి డొంక, పాత పంచాయతీ, మసీదు, ఉయ్యాలవారి వీధి, సైదాబాయిగూడెం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల మధ్యే ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆమె అన్నారు.