కరెంట్ షాక్‌తో బాలుడు మృతి

కోనసీమ: అయినవిల్లి మండలం కొండుకుదురులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కోలా హేమంత్ (16) కొండుకుదురు లంకలో జరుగుతున్న అంబేద్కర్ జయంతి మాసోత్సవాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంటు షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.