40 ఏళ్లుగా తేనీరు, యోగాతో జీవనం
HYD: ఒక్కపూట అన్నం లేకున్నా, గంట నిద్ర తక్కువైనా అల్లాడిపోతాం. అలాంటిది 40 ఏళ్లుగా యాదమ్మ (యాదమాత) తేనీరు, యోగాతో జీవిస్తున్నారు. ఇది అసాధ్యం అనిపిస్తున్నా ఆమె వయసు ఇప్పుడు 101 ఏళ్లు. భవ బంధాలను వదిలి HYD శివారులోని పర్వతాపూర్ నరసింహస్వామి సర్వస్వం అనుకుంటూ ఆయన సేవలో గడుపుతున్నారు. కేవలం ఓ కప్పు తేనీరు తాగి, యోగనిద్రలోనే జీవిస్తున్నారు.