రోడ్లు నిర్మాణంకు రూ.16.81 కోట్లు నిధులు మంజూరు
E.G: మండపేట నియోజకవర్గంలో పలు సీసీ రోడ్లు, డ్రైన్లు, డబ్ల్యూబీఎం రోడ్లు నిర్మాణంకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.16.81 కోట్లు మంజూరు అయ్యాయని రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలియజేశారు. ఈ పనులు అన్నీ మార్చి నెలాఖరు లోగా పూర్తిచెయ్యాల్సి ఉందన్నారు. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌లకు ఎమ్మెల్యే వేగుళ్ళ ధన్యవాదాలు తెలిపారు.