'ఈనెల 18లోపు ధరఖాస్తు చేసుకోండి'

కొయ్యూరు మండలం కాకరపాడు గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ జగన్నాథరావు శనివారం తెలిపారు. 2025-26విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో 40సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 18లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.