KBR పార్కులో వాకర్లకు పోటీలు

KBR పార్కులో వాకర్లకు పోటీలు

HYD: బంజారాహిల్స్‌లోని KBR పార్క్, నేచర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వాకర్లకు బ్రిస్క్ వాక్ పోటీలు పెట్టారు. ఇవాళ ఉదయం ఐఎఫ్ఎస్ అధికారిని ప్రియాంక వర్గీస్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. వాకర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.