వీధిలైట్లకు మరమ్మతులు చేపట్టిన మున్సిపల్ అధికారులు
అనంతపురంలోని తాడిపత్రి బస్టాండ్ రహదారిలో నాలుగు రోజులుగా స్ట్రీట్ లైట్ వెలగడం లేదని స్థానికులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీధిలైట్లు వెలగక రాత్రి సమయంలో ఇబ్బందికరంగా మారిందని స్థానికులు అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు వీధిలైట్లకు మరమ్మతులు చేపట్టారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.