'దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం'

AP: బుడమేరుపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. బుడమేరు కాలువలు అధికారులతో కలిసి పరిశీలించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్ని పెద్ద వర్షాలు వచ్చినా బుడమేరు పొంగే పరిస్థితి లేదని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బుడమేరు కాలువల ఆధునీకరణ చేపట్టిందని తెలిపారు.