తిరుమల ప్రతిష్ఠను కాపాడేందుకు చర్యలు: ఎమ్మెల్యే

తిరుమల ప్రతిష్ఠను కాపాడేందుకు చర్యలు: ఎమ్మెల్యే

సత్యసాయి: మడకశిర టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అవినీతి, టిక్కెట్ల దుర్వినియోగం ఇక జరగదన్నారు. ప్రస్తుత ఛైర్మన్ బి.ఆర్. నాయుడు పారదర్శకంగా వ్యవహరిస్తూ భక్తులకు అన్నప్రసాదం, వసతి వంటి సౌకర్యాలు మెరుగుపరుస్తున్నారని తెలిపారు.