కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతి

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మృతి

SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపురం కు చెందిన నీలం వెంకటేశం (32) గత కొద్ది కాలంగా కిడ్నీల వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరగా, వైద్య చికిత్సకు దాదాపు 20 లక్షల రూపాయలు అయింది. ఆయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.