రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

రేపటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

HYD: ఖైరతాబాద్‌లో బుధవారం బడా గణేష్ విగ్రహం ప్రతిష్ఠిస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 6 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నెల 27 నుంచి ఖైరతాబాద్, షాదన్ కాలేజ్, మింట్ కాంపౌండ్, నిరంకారి, నెక్లెస్ రోటరీ వంటి ప్రాంతాల్లో మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని వాహనదారులకు సూచించారు.