VIDEO: డ్రైనేజీలు శుభ్రం చేయాలని గ్రామస్తుల డిమాండ్
SRPT: మేళ్లచెరువు మండల కేంద్రంలో డ్రైనేజీలు పూడికతో నిండి మురుగునీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు సరిగ్గా వెళ్లకపోవడం వల్ల దుర్వాసన వస్తోందని, దోమల వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని,తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి డ్రైనేజీల్లో పూడిక తీయించి, పారిశుధ్య పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.