తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు

తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు

కాకినాడ: పాప విమోచన ఏకాదశి సందర్భంగా శనివారం పెద్దాపురం మండలం తొలి తిరుపతి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మధ్యాహ్నం 12 గంటలకే 25వేల మందికి పైగా దర్శించుకున్నట్లు అంచనా. మండుటెండను సైతం లెక్క చేయకుండా భక్తులు చెప్పుల్లేకుండా నడుచుకుంటూ ఆలయానికి తరలివచ్చారు. ఈవో వడ్డీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు.