సింగరేణికి విద్యుత్ సంస్థలు భారీగా బకాయిలు

సింగరేణికి విద్యుత్ సంస్థలు భారీగా బకాయిలు

TG: సింగరేణి సంస్థకు తెలంగాణ విద్యుత్ సంస్థలు భారీగా బకాయిపడ్డాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి లోక్‌సభలో వెల్లడించారు. ఇందులో TGGENCO రూ. 18,064 కోట్లు, TGTRANSCO రూ. 24,675 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తం బకాయిలు కలిపి రూ. 42,739 కోట్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం సింగరేణి సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించిన చెల్లింపులు ఇవని మంత్రి తెలిపారు.