VIDEO: స్పష్టంగా.. సరళంగా.. మోదీకి రామ్మోహన్ అనువాదం

SKLM: తన వాగ్దాటితో అనర్గళంగా ప్రసంగించే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అమరావతి పునఃనిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీకి రామ్మోహన్ అనువాదం అందించి ఆకట్టుకున్నారు. హిందీలో ప్రధాని మాట్లాడిన వ్యాఖ్యానాలను స్పష్టంగా ప్రజలకు వివరించారు. ఎక్కడా తడబాటు పడకుండా, కష్టమైన పదాలను సైతం అలవోకగా పలుకుతూ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు.