రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు: మంత్రి
WNP: రైతులు పండించిన పంటలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం బొల్లారం, వీపనగండ్ల, గోవర్ధనగిరిలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోళ్లు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, తదితరులు పాల్గొన్నారు.