మూడు పద్దతుల ద్వారా డెంగ్యూను ఓడించండి

మన్యం: పరిశీలించడం, శుభ్రం చేయడం, మూతలు పెట్టి ఉంచడం వంటి మూడు పద్ధతుల ద్వారా ఆర్బో వైరస్ తరగతికి చెందిన డెంగ్యూ వైరస్ వలన వచ్చే డెంగ్యూను ఓడించవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు వెల్లడించారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.