ట్రాక్టార్ బోల్తాపడి డ్రైవర్ మృతి
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. అబ్బినేని గుంటపాలెం నుంచి గోట్టిపాడు రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఇంజిన్‌తో సహా ట్రాక్టర్ తిరగబడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బోయపాలెం గ్రామానికి చెందిన వంకధర నాగరాజుగా గుర్తించారు. ఘటన సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.