జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న స్పీకర్

GDL: ఐదవ శక్తిపీఠమైన అల్లంపూర్ శ్రీ జోగులాంబ అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకుల ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ మర్యాదలతో స్పీకర్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికి శేష వస్త్రం సమర్పించారు.