బద్వేల్‌కు నూతన సీఐ‌గా లింగప్ప

బద్వేల్‌కు నూతన సీఐ‌గా లింగప్ప

KDP: బద్వేల్ అర్బన్ స్టేషన్ సీఐగా లింగప్ప మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇది వరకు జమ్మలమడుగులో పని చేస్తుండగా.. సాధారణ బదిలీల్లో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ రాజగోపాల్ ప్రొద్దుటూరుకు బదిలీ అయ్యారు. కాగా, మంగళవారం బాధ్యతలు చేపట్టిన సీఐ లింగప్ప బద్వేలలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని పేర్కొన్నారు.