బీజేపీ కార్యాలయంలో సుపరిపాలన బస్సు యాత్ర సమీక్ష
ATP: జిల్లా పార్టీ కార్యాలయంలో అటల్–మోదీ సుపరిపాలన బస్సు యాత్రపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల సంస్కరణలపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగ అంశాలపై చర్చించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాత్ర లక్ష్యాలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన కార్యక్రమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు.