రోడ్డు ప్రమాదం.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
ATP: గుత్తి మండలం రజాపురం గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం రోడ్డు పక్కన ఉన్న మట్టి కుప్పను ఢీకొని ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ రెడ్డికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. గుంతకల్లు నుంచి గుత్తికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.