VIDEO: సీఎం దిష్టిబొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు
KMR: బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా మాట్లాడారు అని ఆరోపించారు. ఉన్నత పదవిలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, సీఎం తక్షణమే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.