సఖి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

సఖి కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

మెదక్ జిల్లా కేంద్రంలోని సఖి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కేసులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి కేసులపై సత్వర స్పందన అవసరమని సూచించారు. మహిళల రక్షణలో సఖి కేంద్రం కీలక భూమిక పోషిస్తోందని వారి సేవలను గుర్తు చేశారు.