తెలుగు యువత అధ్యక్షుడిగా శ్రీనివాస్
AKP: పాయకరావుపేట నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షుడిగా ఎస్. రాయవరం మండలం ధర్మవరం గ్రామానికి చెందిన సుంకర శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం ప్రకటించారు. నియోజకవర్గంలో యువతను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అవకాశం కల్పించిన హోంమంత్రి వంగపూడి అనితకు కృతజ్ఞతలు తెలిపారు.