పాలిటెక్నిక్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు

MHBD: కేసముద్రం పట్టణ కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ బైరి ప్రభాకర్ తెలిపారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ (EV), ఎలక్ట్రానిక్స్ (EMB) బ్రాంచీలకు మిగిలిన సీట్లకు విద్యార్థులు ఈ నెల 6 నుంచి 8 వరకు ఉ. 10 గం.లోపు దరఖాస్తులు అందజేయాలన్నారు.