రామాపురం గ్రామంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే
NDL: అవుకు మండలం రామాపురం గ్రామంలో ఇవాళ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కలిసి పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకుడు పేరం వెంకటసుబ్బారెడ్డి ఆహ్వానం మేరకు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం వారు మాజీ ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్‌ను ఘనంగా సన్మానించారు.