కార్పొరేషన్ షాపుల వేలంలో రూ.1.45 కోట్లు వసూళ్లు: కమిషనర్

కార్పొరేషన్ షాపుల వేలంలో రూ.1.45 కోట్లు వసూళ్లు: కమిషనర్

నెల్లూరు కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాపులను అద్దెకు ఇవ్వడానికి బహిరంగ వేలం నిర్వహించారు. కమిషనర్ వై.ఓ నందన్ నేతృత్వంలో మొత్తం 51 షాపులకు వేలం జరిగింది. డిపాజిట్ల రూపంలో రూ.42లక్షలు, షాపుల బకాయిలు రూ. 1.45 కోట్లు వసూళ్లు చేశారు. ఈ వేలం పాటతో అద్దెల రూపంలో రూ.4.46 లక్షల అదనపు ఆదాయంగా రానుందని పేర్కొన్నారు.