ఆత్మరక్షణకు కరాటే అవసరం: ఎమ్మెల్యే
WNP: కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 30 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. విజేతలకు దేవరకద్ర ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ఆత్మరక్షణ కోసం విద్యార్థినులు కరాటే నేర్చుకోవాలని సూచించారు.