భార్యపై భర్త దాడి... కేసు నమోదు

భార్యపై భర్త దాడి... కేసు నమోదు

MHBD: నెల్లికుదురు మండలంలోని వస్త్రం తండాకు చెందిన భానోత్ నరేష్ మద్యం సేవించి అదనపు కట్నం కోసం భార్య మైబును కొట్టేవాడని స్థానికుల సమాచారం. దీంతో మైబు తన తల్లి ఇంటి వద్ద ఉంటోంది. మంగళవారం నరేష్ అత్తగారింటికి వచ్చి ఇనుప రాడ్డుతో కొట్టి భార్యను గాయపరచనట్లు బాధితురాలు వెల్లడించింది. తన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.