అల్లిపురంలో గ్రంధాలయ 58వ జాతీయ వారోత్సవాలు
విశాఖపట్నం అల్లిపురం గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఆదివారం జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్ రాజు మాట్లాడుతూ.. గ్రంథాలయ ఉద్యమం నేటికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. పాఠకుల అవసరాలకు అనుగుణంగా పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.