సీసీ రోడ్డు పనులు ప్రారంభం
NRPT: మక్తల్ 7వ వార్డు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. మంత్రి వాకిటి శ్రీహరి చొరవతో మైసమ్మ గుడి నుంచి అయ్యప్ప దేవాలయం వరకు మంజూరైన సీసీ రోడ్డు పనులను మున్సిపల్ ఛైర్మన్ మానస హనుమంతు ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ముగింపు వచ్చిందని వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.