రోడ్డు నియమాలు పాటించడం అందరి బాధ్యత: ఎస్సై
NZB: కోటగిరిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా 'అరైవ్-అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై సునీల్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బర్ల మధుకర్, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.