రామప్ప ఆలయాన్ని సందర్శించిన అమెరికా దేశస్థులు

రామప్ప ఆలయాన్ని సందర్శించిన అమెరికా దేశస్థులు

MLG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఇవాళ అమెరికా దేశస్థులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీష్ శర్మ వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ గైడ్ విజయ్ కుమార్ వారికి ఆలయ విశిష్టతను తెలియజేశారు. ఆలయంలోని శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని వారు కొనియాడారు.