సీసీ రోడ్డు పనులు పరిశీలించిన కార్పొరేటర్

RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని సీఆర్ ఎన్‌క్లేవ్ కాలనీలో ఉన్న పోచమ్మ దేవాలయం చుట్టూ సీసీ రోడ్డు పనులను కార్పోరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పరిశీలించారు. రానున్న విజయదశమి వేడుకల నేపథ్యంలో రూ.4.3 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.