ఎస్ఐపై చర్యలకు ఎస్సీ కమిషన్ ఆదేశం
ATP: పెద్దవడుగురు ఘటనపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్ తీవ్రంగా స్పందించారు. ఎస్ఐ ఆంజనేయులుపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి బాధ్యులకు న్యాయం చేయాలని సూచించారు. దళితులపై దాడులు జరిగితే సహించేది లేదని, శాంతిభద్రతలు కాపాడాలని స్పష్టం చేశారు.