ఆటో బోల్తా.. పది మందికి గాయాలు
ప్రకాశం: కొనకలమిట్ల మండలం సిద్ధవరం సమీపంలో ఇవాళ అడవి పంది అడ్డురాగా కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని 108లో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పెదారకట్లకు చెందిన కూలీలు మిరపకాయల కోతకు కొత్తపల్లి వెళ్లే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆటోలోని వారికి స్వల్ప గాయాలు తప్ప పెద్ద ప్రమాదం లేదని సమాచారం.