ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గుండ్లకమ్మ వాగు

ప్రకాశం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మార్కాపురం మండలంలోని గుండ్లకమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మండలంలోని బొడిచెర్ల సమీపంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు తగ్గి వారం రోజులైనప్పటికీ నదిలో వరద ప్రవాహం తగ్గలేదు. దీంతో బోడిచర్ల, తర్లుపాడు, మార్కాపురం, కంభం గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.