'రాష్ట్రంలో యూరియా కొరతను నివారించాలి'

KMM: తెలంగాణలో నెలకొన్న ఎరువుల కొరత గురించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. వానలు విస్తారంగా పడి వరి నాట్లు వేస్తున్న సమయాన రాష్ట్రంలో ఎరువుల కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత శాఖల మంత్రులు శివరాజ్ చౌహన్, జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్తామన్నారు.