'మంత్రి ప్రకటించినా ధాన్యం కొనుగోలు చేయడం లేదు'

EG: ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికొచ్చిన పంట తడిసి మొలకెత్తిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యాన్ని కుప్పలుగా పోసుకుని కాపలా కాస్తున్నామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొంటామని మంత్రి నాదెండ్ల ప్రకటించినా రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు చేయడం లేదని.. మిల్లర్లు తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు.